Home Banner
cc-1

బ్రమణ

నాపేరు బుడుగు. నా సృష్టి కర్తల (అంటే ఏమిటో నాకు తెలియదు గాని నన్ను తయారు చెయ్యటం అని మా బాబాయి చెప్పాడు) పేరు 'బ్రమణ '. అంటే 'బాపు' 'రమణ' అన్నమాట.

ముందు నేను రమణ బుర్ర లోనుంచి పుట్టుకొచ్చాను. వాడు నాకు మాటలు, అల్లరి నేర్పించాడు. ఆ తరవాత బాపుగాడు నాకు చొక్కా లాగూ తొడిగి, కన్ను కొట్టటం, పోజు పెట్టటం నేర్పాడు. నా వయస్సు నాకు సరిగ్గా తెలియదు గాని, మీ తాతలకన్నా పెద్దవాడిని, మీ మనవడుల కన్నా చిన్నవాడిని.

మా బ్రమణ లాగానే నాకు కూడా పెద్ద ఫామిలీ ఉంది. ఈ గొడవంతా నా పుస్తకం చదివితే మీకు అర్థమై పోతుంది. జాటర్ డమాల్ !

shot-video-thump

శ్రీదేవీ కల్యాణం

బాపు, రమణకి కూడా చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. నండూరి రామ మోహనరావు, పార్థ సారథి గార్ల చెల్లెలు. 'నాకు పెళ్లి చూపులు వద్దు కుయ్యో,ఇంకొన్ని ఏళ్ళు పోనీ మొర్రో, నాకు ఉద్యోగం రానీ మియ్యో అన్నా వినలేదు బాపు.

ఆరుగొలను పిల్ల శ్రీ దేవికి వరుడు రచయిత అని తెలుసు గాని, తనకి ఎంతో ఇష్టమైన 'సీతా కల్యాణం' కథ రాసిన రచయిత అని తెలియదు.

నండూరి వారి కుటుంబం అంతా చుట్టూరా కూర్చున్నారు. నల్లటి వాడు, గవర్నమెంటు ఉద్యోగం లేనివాడు అయినాగాని రామమోహనరావుకి మెచ్చినవాడు, శ్రీదేవికీ నచ్చినవాడు అని కొంచెం పెద్దవాడైనా సరే అనుకున్నారు.

రమణ గుండెలు తుఫాన్ లో గొళ్ళెం వెయ్యని తలుపుల్లా టపటప కొట్టేసు కుంటున్నాయి. పూజ గదిలో జొరబడిన కోతి చేతిలో గంటలాగా చెవుల్లో ఒకటే మోత. గొంతు ఆరిపోయి మాట ఆగిపోయింది.

హఠాత్తుగా గదిలో అందరూ మాట్లాడటం ఆపేశారు. శ్రీదేవి గదిలోకి వచ్చి ఒక మూల నిలబడింది. రమణ నుదుటి నుంచి తలంబ్రాలలాగా చెమట చుక్కలు రాలుతున్నాయి.

అమ్మాయి ముఖం చూస్తే, తను మింగటానికి ప్రయత్నించే భయం బయట పడుతుందని ఇంకా భయం వేసింది. ఇంక పెళ్లిచూపులు పాదాలతోనే ఆపేశాడు. ఆ పాదాలు చూసి సరే అనుకున్నాడు, సై అనేశాడు.

మరి శ్రీదేవీ కల్యాణం ఆది లక్ష్మమ్మ గారి చేతుల మీదుగా నే జరిగిందా? వీరిద్దరూ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ అయ్యారా?That is Sridevi-Ramana!

mulla-pudi
mullapudi-history

దోస్తీ

దాదాపు అరవై ఏళ్ల క్రితం, చక్కటి కళ్ళు గీశాడు బాపు. ఆ కళ్ళ మధ్యన పాలరాయిలాగా నున్నటి నుదుటి మీద ఓ చందమామ లాంటి గుండ్రటి బొట్టు పెట్టాడు. వాటికి అలంకారంగా, ఒక చక్కటి ముక్కు చెక్కి దానికింద చిలిపి నవ్వులతో రెండు పెదవులు గీశాడు. ఆహా, ఎంత బామ్మగా ఉంది అని ముళ్ళపూడి దానికి రాధ అని పేరు పెట్టి ఒక కథ అల్లాడు. (చాలా బావుంది అని లోకుల తాత్పర్యం). అప్పుడు ఆ అందాన్ని వర్ణించడానికి , ఒక పొడుగు లాగూ చొక్కా వేసుకున్న గోపాలాన్ని సృష్టించాడు రమణ.

ఆ అల్లికలను అక్కడితో ఆపకుండా, వాళ్లకి ఒక పూర్తి కాలనీ సృష్టించి, దానికి జనతా ఎక్స్ ప్రెస్ అని పేరు తగిలించాడు .

బాపు బొమ్మలు, రమణ కథలు ఒక సాలె గూడులా, నాజూగ్గా, సున్నితంగా జన సముద్రం మీద వల వేసి అమాంతం ఆకర్షించటం మొదలుపెట్టాయి.

mulla-pudi-new
mullapudi-history-1

నేలకు కొట్టిన బంతి

"యామి శిశువా!నేను నీకేం చెప్పాను ?నువ్వేం జేశావ్? ముందర ఓడ రేవులో పని చెయ్యమని పడేస్తే -అక్కడినించి తప్పించుకుని వచ్చి, చెన్నపట్నంలో పడ్డావు. పోనీ, అక్కడైనా ఆకలితో మాడి చెడిపోతావనుకుంటే, దానిమీదే కథలు రాశావు. సరే, జర్నలిస్టు అయిపోయావు, తప్పుడు కథలు రాసి, దెబ్బలు తింటావనుకుంటే, రివ్యూలు రాసేసి సినిమాల్లోకి దూరిపోయావు. అక్కడేమో మరి నాకు చాలా నచ్చిన పిచ్చి డాన్సులు, పచ్చి బూతులు, కొట్లాటలు వదిలేసి, నీకూ నీ ఫ్రెండుకీ నచ్చిన అందమైన సినిమాలు తీసి జనాన్ని పట్టేశావా! ధిక్! శిశువా! ధిక్ ధిక్!!"

foot-above-graphics