“స్వాతి” బలరాం గారి కోరిక మీద- ముళ్ళపూడి వెంకటరమణ గారు తన ఆత్మకథని స్వాతి వారపత్రిక లో రాయటం మొదలు పెట్టారు. ధవళేశ్వరం లో పుట్టి పెరిగిన రమణ గారు, తండ్రి చిన్నప్పుడే పోవడంతో మద్రాసు వచ్చేశారు. తల్లి గారి కష్టంతో కేసరి స్కూల్లో ఇంటర్ ఫైనల్ దాకా చదివారు. అప్పుడే కధలు రాయడం మొదలుపెట్టారు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం సంపాదించారు. “బుడుగు” కథలూ, అనువాదాలూ, “తెలుగు వెలుగులు” వంటి రచనలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎడిటర్ గారితో మాట పట్టింపు వచ్చి, పత్రికలో ఉద్యోగం మానేశారు.
By: Mullapudi Venkataramana
9 hr 19 min
2023-05-02
Fiction
Give as a gift